భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ అక్టోబర్ 10న తలపెట్టిన ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ, సీజేపీ నిరసనకు సిద్ధమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి నుంచి ఢిల్లీ నగరాన్ని అష్టదిగ్బంధనం చేసి, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. దుకాణాలు, కార్యాలయాలను మూసివేయాలని, 57 మెట్రో స్టేషన్ల గేట్లను రాత్రి 10 గంటల నుంచి మూసివేయాలని ఆదేశించారు.