ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ 10 మిస్సైళ్లను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖతార్‌లో ఉన్న భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ పలు కీలక సూచనలు జారీ చేసింది. దాడుల వేళ ఇళ్లల్లోంచి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని భారత రాయబారకార్యాలయం పేర్కొంది. ఖతార్‌లో జీవనోపాధి కోసం వెళ్లి ఎంతో మంది భారతీయులు నివసిస్తున్న సంగతి తెలిసిందే.