భూతల దాడులకు ప్రయత్నిస్తే శత్రువుల కాళ్లు నరికేస్తాం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో, ఇరాన్  తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఇరాన్ అణు కేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై యూఎస్ బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసిందని, అమెరికా భూతల దాడులకు ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కార్యాచరణ ప్రధాన కార్యాలయం IRGC ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ గడ్డపై అడుగుపెట్టే ఏ శత్రువు కాళ్లనైనా నరికేస్తామని IRGC ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫికారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్