ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ఫోన్‌

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఫోన్‌ చేశారు. ఇరాన్‌పై దాడి పరిస్థితులను మోదీకి వివరించారు. ఇజ్రాయెల్-ఇరాన్ పరిస్థితులపై నెతన్యాహుతో చర్చించినట్లు మోదీ ట్వీట్ చేశారు. ఈ విషయంలో భారత్ అభిప్రాయాన్ని వారికి తెలిపినట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనేలా ప్రయత్నించాలని నెతన్యాహుని కోరినట్లు పేర్కొన్నారు. మోదీతోపాటు ప్రపంచ దేశాధినేతలకు నెతన్యాహు ఫోన్‌ చేసి దాడిపై వివరణ ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్