శ్రీవారిని దర్శించి, రాకెట్ నమూనాతో పూజలు చేసిన ఇస్రో చైర్మన్ నారాయణన్

ఇస్రో చైర్మన్ నారాయణన్ తన బృందంతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లి, జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-17, ఇఓఎస్- 05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం జరగనుంది.

సంబంధిత పోస్ట్