శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిలిపివేసిన సర్వదర్శనం, దివ్యదర్శనం ఉచిత టోకెన్ల జారీని టీటీడీ అధికారులు సెప్టెంబర్ 24 నుంచి తిరిగి ప్రారంభించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కేంద్రాల్లో ఈ టోకెన్లను జారీ చేస్తారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఈ టోకెన్లను జారీ చేస్తారు. భక్తులు తమ దర్శన ప్రణాళికను దీనికి అనుగుణంగా చేసుకోవాలని టీటీడీ సూచించింది.