జగిత్యాల బాలుడి దత్తత వివాదం.. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన కలెక్టర్

TG: జగిత్యాలలో మూడేళ్లుగా దంపతుల వద్ద పెరుగుతున్న బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చట్టబద్ధమైన దత్తత జరగలేదనే కారణంతో శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఈ వివాదంపై అక్టోబర్ 16న హైకోర్టు స్పందించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించింది. అయితే, తాజాగా జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తమ వాదనలను వినలేదని, తల్లిదండ్రుల వద్ద బాలుడు ఉంటే విచారణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంటూ, బాలుడిని తిరిగి కేంద్రానికి అప్పగించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕