జగిత్యాల: మరమ్మత్తు పనులు పరిశీలించిన చైర్ పర్సన్

జగిత్యాల విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద మరమ్మత్తులు పూర్తయిన జెసిబి యంత్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. జెసిబి సక్రమంగా పనిచేసేలా మరమ్మత్తులు జరిగాయని అధికారులు తెలిపారు. పట్టణంలో అత్యవసర పనులు, మురుగు కాలువల శుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలలో జెసిబిని సమర్థవంతంగా ఉపయోగించాలని చైర్‌పర్సన్ సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుమాల రాజ్ కుమార్, కూతురు రాజేష్, కూతురు శేఖర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్