జగిత్యాల: అమరవీరుల స్థూపాన్ని సందర్శించిన చైర్ పర్సన్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో గల అమరవీరుల స్థూపాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అమరవీరుల స్థూపం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పూల అలంకరణ, విద్యుత్ వెలుగులు, పట్టణ ముఖ్య కూడలిలో కూడా విద్యుత్ వెలుగులు సమకూర్చాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్