జగిత్యాల: కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల రూరల్ మండలంలోని చల్ గల్, తాటిపెల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ, తూకం విధానం, 17% తేమ శాతం నిర్వహణ, కేంద్రాల వద్ద వసతులను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్