జగిత్యాల: పశు వదశాల తనిఖీ

జగిత్యాల పట్టణంలో గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో గోవుల వధను నిరోధించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని వార్డు నెంబర్ 13 పరిధిలో ఉన్న స్లాటర్ హౌస్‌లో, జగిత్యాల ఏరియా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రావు అనుమతి పత్రాలను పరిశీలించారు. 1980 నాటి జంతువధశాల పరిరక్షణ నిబంధనలు, 1977 నాటి జంతు చట్టం ప్రకారం ధ్రువీకరణ పొందిన పశువులను మాత్రమే వధిస్తున్నారా లేదా అని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్