జగిత్యాల: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణంలోని 36, 42, 43 వార్డులలో 1 కోటి 30 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులను శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. పట్టణంలో ఎక్కడా కూడా సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చూస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మన్సూర్, గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, హైమద్, బోడ్ల రాజు, చెట్పల్లి సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్