పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం, జిల్లాలో నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం, పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా డి.జే. వినియోగించరాదని ఆయన తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.