జగిత్యాల: అక్రిడిటేషన్ ఉంటేనే వాహనాలపై స్టిక్కర్

సమాచార పౌరసంబంధాల శాఖ నుంచి అధికారికంగా అక్రిడేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై 'ప్రెస్' అని రాసుకోవాలని లేదా స్టిక్కర్లు వేసుకోవాలని డీపీఆర్వో పల్లికొండ నరేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్ లేని వ్యక్తులు వాహనాలపై 'ప్రెస్' అని రాసుకోవడం మోటారు వాహన చట్టానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్