జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్, ఆడిట్ అండ్ గ్రౌండింగ్ అధికారులు 8 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ శాఖలో అకౌంట్స్, పన్నుల నిర్వహణను పరిశీలించి, మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం, ముఖ్యంగా హౌస్ టాక్స్ సరిగ్గా లెక్కించారా లేదా అని రికార్డులను తనిఖీ చేశారు. కాగితాలపై ఉన్న లెక్కలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు సరిపోలుతున్నాయా లేదా అని ప్రత్యక్షంగా విచారణ చేశారు. జగిత్యాలలో హౌస్ టాక్స్ అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.