జగిత్యాల రూరల్ మండలం పొలాస జెడ్పిహెచ్ఎస్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.