జగిత్యాల పట్టణ గాంధీనగర్ మాదిగ సంఘ భవనంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో మాట ఇచ్చి తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఈనెల 9న తాసిల్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు.