జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి, జనవరి 29వ తేదీ వరకు మొత్తం 483 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ధర్మపురిలో 50, జగిత్యాలలో 190, కోరుట్లలో 91, మెట్‌పల్లిలో 109, రాయకల్‌లో 43 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కూడా ప్రశాంతంగా ముగిసింది.