మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలను నిరంతరం పర్యవేక్షించే క్రమంలో భాగంగా ఎస్పీ ఈ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు తదితర అంశాలను ఎస్పీ పరిశీలించారు.