శనివారం, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, నేర నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ తనిఖీలో డీఎస్పీ రాములు, సీఐలు సురేష్, అనిల్ కుమార్, ఎస్‌ఐ చిరంజీవి కూడా పాల్గొన్నారు.