కోరుట్ల: శాంతి కమిటీ సభ్యుల సమావేశం

బక్రీద్ పండుగ సందర్భంగా కోరుట్ల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలలో భాగంగా మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, కోరుట్లలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సీఐ కే. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు చెందిన బీజేపీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికపై సీఐతో పాటు ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, శ్రీధర్ రెడ్డి పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్