మెట్పల్లి: బాధ్యతలు చేపట్టిన సిఐ సురేష్ బాబు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా సురేష్ బాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను కలిసి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్