నామినేషన్ల స్వీకరణ సజావుగా జరగాలి: అడిషనల్ కలెక్టర్

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీలో, జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి బి. రాజా గౌడ్ అధికారులతో మాట్లాడుతూ, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని, చివరి రోజు తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చివరి రోజున, సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్ సెంటర్ లోపల ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్