సర్పంచ్ పదవీకి వేలం పాటలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవిని బీసీ రిజర్వేషన్ కింద కేటాయించినప్పటికీ, గ్రామ వీడీసీలు ఓసీలకు సమాచారం ఇవ్వకుండానే రూ.28.60 లక్షలకు వేలం పాట నిర్వహించారని, దీనిని అడ్డుకున్నందుకు కొందరు గ్రామస్తులను బహిష్కరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మంగళవారం ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల పదవులకు కూడా వేలం పాటలు నిర్వహిస్తున్నారని, బహిష్కరించబడిన వారితో ఎవరూ మాట్లాడకూడదని, నిత్యావసరాలు, వైద్య సేవలు, మీ సేవ వంటి వాటిని పొందకూడదని, వేలం ద్వారా వచ్చిన డబ్బులు వారికి చెందవని ఆదేశాలు జారీ చేశారని బాధితులు మెట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరద కాలువ కోసం సేకరించిన ప్రభుత్వ భూమిని గ్రామ వీడీసీలు తమ స్వంతం చేసుకోవాలని చూస్తున్నారని, దీనిని వ్యతిరేకించినందుకే తమను బహిష్కరించారని బాధితులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్