జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల

2025-26 విద్యా సంవత్సరానికి జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదలైంది. రెండు సెషన్లుగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తెలిపింది. జనవరిలో సెషన్-1, ఏప్రిల్‌లో సెషన్-2 ఉంటాయని పేర్కొంది. నవంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తామని, వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని చెప్పింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్