ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 28న ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నారు. దాదాపు 24 ఏళ్ల నిరీక్షణ తర్వాత రూ.11,200 కోట్ల వ్యయంతో మొదటి దశ పూర్తయింది. ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో జెవార్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించి, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.