రైల్వేలో అగ్నివీర్లు, మాజీ సైనికులకు ఉద్యోగ రిజర్వేషన్లు

మాజీ సైనికులు, అగ్నివీరులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యంతో కొత్త సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తక్షణమే 5,000 మందికి పైగా మాజీ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో 'పాయింట్స్‌మెన్‌'గా నియమించుకోనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో మాజీ సైనికుల కోసం మొత్తం 14,788 పోస్టులను రిజర్వ్ చేశారు.

సంబంధిత పోస్ట్