TG: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నూతన ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.ఎస్. శ్రీనివాసరాజును ప్రభుత్వం శనివారం నియమించింది. గతంలో ఛైర్మన్‌గా ఉన్న ఎన్. సత్యనారాయణ రాజీనామా చేయడంతో ఈ నియామకం జరిగింది. శ్రీనివాసరాజుకు బ్యూరోక్రసీలో సుదీర్ఘ అనుభవం ఉంది, ఉమ్మడి ఏపీ, తెలంగాణలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. టీటీడీ జేఈవోగా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా సేవలందించారు.