TG: సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ చేసి రూపొందించిన ఈ నివేదిక శుక్రవారం సీఎంకు చేరింది. ఈ క్రమంలో దీనిపై సీఎం మంత్రులతో చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని నివేదికలో PC ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లు సమాచారం.