ఆంధ్రప్రదేశ్‌లో భారీ వాహనాలు నడిపే లైసెన్స్ పొంది, అంబులెన్స్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా మన్నెం కల్పన చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలానికి చెందిన కల్పన, 42 ఏళ్ల వయసులో, 15 మంది పురుషులతో పోటీపడి ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణలో నిలబడి, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ సాధించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ, రోగులకు అండగా నిలుస్తున్నారు. ఆమె తెగువ, సేవాగుణం నేటి తరం ఆడపిల్లలకు స్ఫూర్తిదాయకం.