కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు కట్టపై 3.14 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ కు, అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిరాజు, స్థానిక వార్డు కౌన్సిలర్ ఖాలేఖ్, నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, యండి. దావూద్, గౌస్, మజ్జు, తదితరులు పాల్గొన్నారు.