కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ శీతల్, హెడ్ కానిస్టేబుల్ సాయగౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో అంటరానితనం, సైబర్ క్రైమ్ వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, జీపివోలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.