జుక్కల్‌లో బీఎల్ఓలకు గురువారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో కామారెడ్డి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ చందర్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి అని సూచించారు. ఓటు హక్కు విషయంలో ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని బీఎల్ఓలని ఆయన కోరారు.