శుక్రవారం కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని ఆమె తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ కూడా పాల్గొన్నారు.