మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చలు సఫలం

శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్తో మున్సిపల్ కార్మికుల సమస్యలపై జరిగిన చర్చలు సఫలమయ్యాయి. శానిటేషన్లో మరణించిన కార్మికుల స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 60 ఏళ్లు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామని, అనారోగ్యంతో ఉన్నవారిని యధావిధిగా తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. వాహనాల ఇన్సూరెన్స్ కూడా అందిస్తామని వెల్లడించారు. ఈ చర్చల్లో రాష్ట్ర కార్యదర్శి కందారపు రాజనర్సు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి మహబూబ్ అలీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్