ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల రెండో రోజు గురువారం 12 వార్డులకు గాను 24 నామినేషన్లు దాఖలయ్యాయని మున్సిపల్ ఎన్నికల అధికారి మహేష్ కుమార్ తెలిపారు. 1వ వార్డులో 2, 2వ వార్డులో 1, 3వ వార్డులో 2, 4వ వార్డులో 3, 5వ వార్డులో 4, 7వ వార్డులో 2, 8వ వార్డులో 1, 9వ వార్డులో 4, 10వ వార్డులో 3, 12వ వార్డులో 2 చొప్పున నామినేషన్లు స్వీకరించారు. అయితే, 6, 11 వార్డులకు మాత్రం ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.