ఆటోల్లో స్థాయిని మించి ప్రయాణికులను ఎక్కిస్తే ఆటోలు సీజ్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రవాణా శాఖ అధికారులు ఆటో రిక్షాల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలపై కఠిన చర్యలు చేపట్టారు. సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారులు రఫీ, మధుకర్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, అధిక ప్రయాణికులతో నడుస్తున్న పలు ఆటో రిక్షాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు చట్టబద్ధమైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, నిర్దేశిత పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్