మహేశ్వరి రైస్ మిల్‌లో ధాన్యం దిగుబడిని పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్‌ను సందర్శించి ధాన్యం దిగుబడి తీరును పరిశీలించారు. మిల్లుకు చేరుతున్న ధాన్యం నాణ్యత, తూకం ప్రక్రియ, నిల్వ విధానం, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అన్‌లోడింగ్ చేసి మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్