కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజుతో కలిసి శనివారం జుక్కల్ సెగ్మెంట్లోని మద్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులను, వారి అవసరాల కోసం అందుబాటులో ఉన్న మందులను, తాగునీటి సౌకర్యాన్ని, 144 సెక్షన్ అమలు తీరును ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రం ఇంచార్జీలకు పలు సూచనలు చేశారు.