మూడవ విడత నామినేషన్ల స్వీకరణ సందర్భంగా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ సందర్శించారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో అడిగి తెలుసుకున్నారు. రెండవ విడత నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ), విత్ డ్రావెల్ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు.