జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

శనివారం కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఐడీఓసీ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ప్రధాన ఉద్యానవనం వంటి ప్రాంతాలను పరిశీలించి, పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఆవరణలో రోజువారీ పారిశుధ్య చర్యలు క్రమబద్ధంగా చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణ జరపాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఐడీఓసీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్