కామారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు షురూ

కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ఏరియా సర్వేనెంబర్ 6లో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులకు మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది. స్పందన రాకపోవడంతో, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి జేసిబిల సహాయంతో ఆక్రమణలను కూల్చివేశారు. మున్నూరు కాపు సంఘం కోర్టు నుండి స్టే పొందడంతో వారి భవనాన్ని మినహాయించి, మిగతా ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. ఆక్రమణలు తొలగించిన స్థలాన్ని స్వాధీనపరచుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్