తాత్కాలిక ఆనందానికి విలువైన జీవితం నాశనం చేసుకోవద్దు: సీఐ

నూతన సంవత్సరం వేడుకలను ఆనందంగా, చట్టానికి లోబడి జరుపుకోవాలని కామారెడ్డి పట్టణ ప్రజలకు టౌన్ సీఐ నరహరి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ బాక్సులు వినియోగిస్తూ ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్