సీపీడీ కమిటీ సభ్యుడిగా డాక్టర్​ అరవింద్ గౌడ్

తెలంగాణ మెడికల్ కౌన్సిల్​లోని కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (సీపీడీ) కమిటీకి కామారెడ్డికి చెందిన పిల్లల డాక్టర్​ అరవింద్​ గౌడ్​ కో-ఆప్టెడ్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ కమిటీ ద్వారా వైద్యులు ఏటా 5 క్రెడిట్ పాయింట్లు (సుమారు 40 గంటలు) కలిగిన సీపీడీ కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్, బోధనా సంస్థలకు అక్రెడిటేషన్ ఇవ్వడంతో పాటు, వైద్యులు తాజా వైద్య పరిజ్ఞానం, ఆవిష్కరణలు, మెడికో-లీగల్ అంశాలపై అవగాహన పెంచుకునేలా ఈ కమిటీ కృషి చేస్తుంది.

సంబంధిత పోస్ట్