విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నాగిరెడ్డిపేట మండలం విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని స్థానిక రామాలయంలో సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా వెంకటయ్య చారి, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ చారి, ప్రధాన కార్యదర్శిగా బాలకృష్ణ చారి, కోశాధికారిగా కృష్ణ చారిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షులు వెంకటాచారి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘానికి తన వంతు కృషిచేసి సంఘవృత్తికి తోడ్పడుతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్