కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు

నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని, శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు, సమీష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్