ఎల్లారెడ్డి సెగ్మెంట్ వాసికిదక్కిన జీహెచ్ఎంసీ డైరెక్టర్ పదవి

ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి సునంద గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) డైరెక్టర్ పదవిని శుక్రవారం చేపట్టారు. ఆమె ప్రాథమిక విద్యను సొంత ఊరిలో, పదో తరగతి వరకు రామారెడ్డి జడ్పీహెచ్ఎస్లో అభ్యసించారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్నత పదవిని అధిష్ఠించడం పట్ల గ్రామస్థులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సునంద అందరికీ స్ఫూర్తిదాయకమని గ్రామస్తులు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్