ఎల్లారెడ్డి పట్టణంలో పాత ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరంలోకి ప్రజలు ప్రశాంతంగా అడుగుపెట్టారు. పోలీసుల ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్ హెచ్చరికల నేపథ్యంలో, గత ఏడాదిలాగా రోడ్లపై మద్యం సేవించి, డ్యాన్సులు చేయడం వంటి న్యూసెన్స్ కార్యక్రమాలు కనిపించలేదు. ప్రజలు తమ ఇళ్లలోనే పార్టీలు చేసుకుని, కేకులు కట్ చేసుకుని నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. రాత్రి పూట పోలీసు పెట్రోలింగ్ కూడా బాగానే పని చేసినట్లు తెలుస్తోంది.