ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా జగ్జీవన్

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా జగ్జీవన్ ను నియమిస్తూ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనే పనిచేసిన అనుభవం ఉన్న జగ్జీవన్ తిరిగి ఇక్కడే పదోన్నతిపై వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న మహేష్ కుమార్ ను విఆర్ కి పంపినట్లు సమాచారం. మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ కు కమిషనర్ మహేష్ మధ్య వున్న మనస్పర్తలే ఈ బదిలీకి కారణం అన్న వాదనలు విన్పిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్