జర్నలిస్టుల బస్ పాస్ సమస్యలను పరిష్కరించాలి

కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ కు బుధవారం టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ ఆర్టీసీ బస్సు పాసుల జారీలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. జిల్లా యూనియన్ అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ, డిపోలో పాసుల ప్రింట్ సరిగ్గా రావడం లేదని, దీంతో ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పాసులను లామినేషన్ చేసి ఇవ్వాలని, అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్న కొందరు సిబ్బంది 35 కిలోమీటర్ల వరకే ఇస్తామంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే జర్నలిస్టుల బస్ పాస్ సమస్యలను పరిష్కరించాలని డిఎం ను కోరారు.

సంబంధిత పోస్ట్